శ్రీ కాళహస్తి, ఆగస్టు 25, (పున్నమి న్యూస్): కులమతాలకు, వర్గ వైషమ్యాలకు అతీతంగా శ్రీకాళహస్తి పుర ప్రజల సేవలో తరించిన మాజీ మున్సిపల్ చైర్మన్, శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి చైర్మన్ స్వర్గీయ శాంతారాం జె పవార్‌కి పట్టణ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంటుందని శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. శాంతారాం జె పవార్ జయంతిని పురస్కరించుకుని పవార్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ‘ది స్కూల్’ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పూలమాలలు వేసి, ప్రత్యేక పూజలు నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఎనిమిది దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన పవార్ కుటుంబం పట్టణాభివృద్ధికి, విద్యా-ఉపాధి అవకాశాల మెరుగుదలకు నిస్వార్థంగా కృషి చేసిందని కొనియాడారు. రాజకీయాలకు అతీతంగా పవార్ కుటుంబం, బొజ్జల కుటుంబం శ్రీకాళహస్తి శ్రేయస్సు కోసం సమన్వయంతో పనిచేశాయని, చివరి శ్వాస వరకు శాంతారాం గారు ప్రజాసేవలోనే పరితపించారని గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పవార్ కుటుంబ సభ్యులు పరమేశ్వర రావు వి పవార్, ముకుంద రావు జె పవార్, జనార్థన్ రావు జె పవార్, రాజారాం రావు వి పవార్, శివశంకర్ రావు వి పవార్, హేమంత్ రావు యం గైక్వాడ్, ఇతర నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి చరిత్రలో శాంతారామ్ పవార్ సేవలకి ప్రత్యేక స్థానం ఉంది-ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి