Tuesday, 22 September 2026
  • Home  
  • శ్రీ సంకల్ప్ వెల్ఫేర్ సొసైటీ అన్నదాన కార్యక్రమానికి హాజరైన “ఆప్” రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సయ్యద్ హైదర్ — సోదరభావం, మతసామరస్యానికి గణేష్ ఉత్సవాలు వేదిక కావాలి
- నిర్మల్

శ్రీ సంకల్ప్ వెల్ఫేర్ సొసైటీ అన్నదాన కార్యక్రమానికి హాజరైన “ఆప్” రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సయ్యద్ హైదర్ — సోదరభావం, మతసామరస్యానికి గణేష్ ఉత్సవాలు వేదిక కావాలి

నిర్మల్ జిల్లా సెప్టెంబర్ 21 ( పున్నమి ప్రతినిధి) నిర్మల్: శ్రీ సంకల్ప్ సొసైటీ సభ్యుల ఆహ్వానం మేరకు నిర్మల్‌లో నిర్వహించిన గణేష్ ఉత్సవాల అన్నదాన కార్యక్రమంలో *ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సయ్యద్ హైదర్* పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమానికి ఆయన 25 కేజీల కంది పప్పును అందజేశారు. ఈ సందర్భంగా సయ్యద్ హైదర్ మాట్లాడుతూ, *గణేష్ ఉత్సవాలు భక్తితో పాటు సోదరభావం, మతసామరస్యం, ఐక్యతను చాటేలా జరగాలని ఆకాంక్షించారు* . అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు అన్ని వర్గాల ప్రజలను ఒక్కచోట చేర్చి, పరస్పర ఆత్మీయతను పెంచుతాయని అన్నారు. *నిర్మల్‌లో అన్ని మతాల ప్రజలు పరస్పరం గౌరవించుకుంటూ పండుగలు జరుపుకోవడం మన సంస్కృతికి ప్రతీక అని పేర్కొన్నారు. మతం ఏదైనా.. మానవత్వం ఒక్కటేనని* , సోదరభావం మరియు మతసామరస్యమే సమాజానికి బలమైన పునాది అని అన్నారు. *శ్రీ సంకల్ప్ సొసైటీ ఆధ్వర్యంలో భవిష్యత్తులో చేపట్టే సేవా కార్యక్రమాల్లో కూడా తన వంతు సహకారంతో పాల్గొంటామని* సయ్యద్ హైదర్ తెలిపారు. సమాజంలో ఐక్యత, సోదరభావం, మతసామరస్యాన్ని పెంపొందించే మరిన్ని సేవా కార్యక్రమాలను సొసైటీ చేపట్టాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఆప్ జనరల్ సెక్రటరీ సీ.హెచ్.వినోద్, స్పోక్స్ పర్సన్ వసంత రావు, మరియు సోషల్ వర్కర్ ఎక్తా బ్లడ్ బ్యాంక్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ సాజిద్ తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్ జిల్లా సెప్టెంబర్ 21 ( పున్నమి ప్రతినిధి)
నిర్మల్: శ్రీ సంకల్ప్ సొసైటీ సభ్యుల ఆహ్వానం మేరకు నిర్మల్‌లో నిర్వహించిన గణేష్ ఉత్సవాల అన్నదాన కార్యక్రమంలో *ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సయ్యద్ హైదర్* పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమానికి ఆయన 25 కేజీల కంది పప్పును అందజేశారు.

ఈ సందర్భంగా సయ్యద్ హైదర్ మాట్లాడుతూ, *గణేష్ ఉత్సవాలు భక్తితో పాటు సోదరభావం, మతసామరస్యం, ఐక్యతను చాటేలా జరగాలని ఆకాంక్షించారు* . అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు అన్ని వర్గాల ప్రజలను ఒక్కచోట చేర్చి, పరస్పర ఆత్మీయతను పెంచుతాయని అన్నారు.

*నిర్మల్‌లో అన్ని మతాల ప్రజలు పరస్పరం గౌరవించుకుంటూ పండుగలు జరుపుకోవడం మన సంస్కృతికి ప్రతీక అని పేర్కొన్నారు. మతం ఏదైనా.. మానవత్వం ఒక్కటేనని* , సోదరభావం మరియు మతసామరస్యమే సమాజానికి బలమైన పునాది అని అన్నారు.

*శ్రీ సంకల్ప్ సొసైటీ ఆధ్వర్యంలో భవిష్యత్తులో చేపట్టే సేవా కార్యక్రమాల్లో కూడా తన వంతు సహకారంతో పాల్గొంటామని* సయ్యద్ హైదర్ తెలిపారు. సమాజంలో ఐక్యత, సోదరభావం, మతసామరస్యాన్ని పెంపొందించే మరిన్ని సేవా కార్యక్రమాలను సొసైటీ చేపట్టాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఆప్ జనరల్ సెక్రటరీ సీ.హెచ్.వినోద్, స్పోక్స్ పర్సన్ వసంత రావు, మరియు సోషల్ వర్కర్ ఎక్తా బ్లడ్ బ్యాంక్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ సాజిద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.