ఆర్మూర్ లో ఆధ్యాత్మిక చిహ్నంగా నిలిచిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ నవనాథ సిద్ధులగుట్టలో ఆదివారం భక్తి పారవశ్యం నెలకొంది. తెల్లవారుజాము నుంచే భారీ సంఖ్యలో భక్తులు గుట్టపైకి చేరుకుని పరమేశ్వరునికి పంచామృతాలు, బిల్వపత్రాలతో అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం గుట్టపై ఉన్న రామాలయం, దుర్గామాత ఆలయం, దత్తాత్రేయ స్వామి , అయ్యప్ప స్వామి ఆలయం, ఎల్లమ్మ తల్లి ఆలయం, ఏకశిల స్తంభం సమీపంలోని హనుమాన్ ఆలయాల్లో భక్తులు విశేషంగా మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణమంతా శివనామస్మరణ, భక్తిగీతాలు, హరహర మహాదేవ శబ్దాలతో మారుమోగింది.
శివనామస్మరణతో మారుమోగిన సిద్ధులగుట్ట….