Saturday, 5 September 2026
  • Home  
  • శాంతియుత వాతావరణంలో వినాయక చవితి వేడుకలు నిర్వహించాలి
- తిరుపతి

శాంతియుత వాతావరణంలో వినాయక చవితి వేడుకలు నిర్వహించాలి

సత్యవేడు: 👉 వినాయక చవితి సందర్భంగా ప్రజలు శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో ఉత్సవాలను నిర్వహించాలని సత్యవేడు పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ లావణ్య సూచించారు. 👉 వినాయక విగ్రహాల ప్రతిష్ఠ, ఊరేగింపు, నిమజ్జనం సమయంలో పోలీసుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని, ట్రాఫిక్‌కు మరియు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు సహకరించాలని కోరారు. 👉 ఊరేగింపుల సమయంలో అధిక శబ్దంతో DJలు వినియోగించడం, అనుమతి లేని కార్యక్రమాలు నిర్వహించడం, మద్యం సేవించడం, గొడవలకు పాల్పడటం, అసభ్యకరంగా ప్రవర్తించడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. 👉 అదేవిధంగా సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్‌ఐ లావణ్య సూచించారు. విరాళాల పేరుతో వచ్చే అనుమానాస్పద QR కోడ్‌లు, UPI లింకులు , ఫోన్ కాల్స్, మెసేజ్‌లను నమ్మవద్దని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ OTP, PIN, బ్యాంకు ఖాతా వివరాలను ఇతరులతో పంచుకోవద్దన్నారు. 👉 సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు , అభ్యంతరకర పోస్టులు , మత విద్వేషాలను రెచ్చగొట్టే సందేశాలను ప్రచారం చేయరాదని సూచించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు సమాచారం అందించి, సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని తెలిపారు. 👉 ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు సైబర్ నేరాల నియంత్రణకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రెవెన్యూ, మున్సిపల్, ఫైర్, ఎలక్ట్రికల్ తదితర శాఖల సమన్వయంతో అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నట్లు ఎస్‌ఐ లావణ్య వెల్లడించారు.

సత్యవేడు:
👉 వినాయక చవితి సందర్భంగా ప్రజలు శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో ఉత్సవాలను నిర్వహించాలని సత్యవేడు పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ లావణ్య సూచించారు.

👉 వినాయక విగ్రహాల ప్రతిష్ఠ, ఊరేగింపు, నిమజ్జనం సమయంలో పోలీసుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని, ట్రాఫిక్‌కు మరియు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు సహకరించాలని కోరారు.

👉 ఊరేగింపుల సమయంలో అధిక శబ్దంతో DJలు వినియోగించడం, అనుమతి లేని కార్యక్రమాలు నిర్వహించడం, మద్యం సేవించడం, గొడవలకు పాల్పడటం, అసభ్యకరంగా ప్రవర్తించడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.

👉 అదేవిధంగా సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్‌ఐ లావణ్య సూచించారు. విరాళాల పేరుతో వచ్చే అనుమానాస్పద QR కోడ్‌లు, UPI లింకులు , ఫోన్ కాల్స్, మెసేజ్‌లను నమ్మవద్దని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ OTP, PIN, బ్యాంకు ఖాతా వివరాలను ఇతరులతో పంచుకోవద్దన్నారు.

👉 సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు , అభ్యంతరకర పోస్టులు , మత విద్వేషాలను రెచ్చగొట్టే సందేశాలను ప్రచారం చేయరాదని సూచించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు సమాచారం అందించి, సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని తెలిపారు.

👉 ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు సైబర్ నేరాల నియంత్రణకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రెవెన్యూ, మున్సిపల్, ఫైర్, ఎలక్ట్రికల్ తదితర శాఖల సమన్వయంతో అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నట్లు ఎస్‌ఐ లావణ్య వెల్లడించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.