ఖమ్మం జిల్లాలోని ROFR పట్టా భూముల యజమానులు తమ భూముల్లో బోర్‌వెల్ తవ్వుకునేందుకు అనుమతులు మంజూరు చేస్తామని జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్. తెలిపారు. దరఖాస్తుదారులు అనుమతుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, దరఖాస్తు చేసుకున్న రోజే అనుమతి ఇచ్చేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ నెల 10వ తేదీన జిల్లాలోని అన్ని మండల కార్యాలయాల్లో ప్రత్యేకంగా దరఖాస్తులు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ROFR పట్టాదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, నిర్ణీత తేదీన సంబంధిత మండల కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించాలని ఆయన సూచించారు.



