శ్రీ కాళహస్తి, ఆగస్టు 18, (పున్నమి న్యూస్): ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలకు హాజరైన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సోమవారం పలువురు మంత్రులు, సహచర శాసనసభ్యులతో కలిసి అసెంబ్లీలో పాల్గొన్నారు. వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం సభకు చేరుకున్న ఆయన, విరామ సమయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను కలసి నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వైకాపా నాయకులకు అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడే ధైర్యం లేక పారిపోతున్నారని విమర్శించారు. సభలో మంత్రి నారా లోకేష్ ఇచ్చి ప్రెజెంటేషన్‌తో వైకాపా దుష్ప్రచారాలు, గత ప్రభుత్వ మోసాలు బయటపడ్డాయని పేర్కొన్నారు. ఐదేళ్ల పాలనలో నిరుద్యోగులను నట్టేట ముంచిన వైకాపాకు డీఎస్సీ గురించి మాట్లాడే అర్హత లేదని, స్వార్థ రాజకీయాల కోసం అభ్యర్థులను రెచ్చగొడుతున్న ఆ పార్టీ కపట నాటకాలను ప్రజలు క్షమించరని మండిపడ్డారు.

వైకాపా నేతలకి అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడే ధైర్యం లేదు-ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి