ఈ నెల 24న నిర్వహించనున్న యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్ష-2026 కోసం విశాఖపట్నంలోని 17 కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా సంయుక్త కలెక్టర్ విద్యాధరి తెలిపారు.
శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. విశాఖ కేంద్రంగా మొత్తం 7,769 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు.
పరీక్షలు ఉదయం 9.30 నుండి 11.30 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2.30 నుండి 4.30 గంటల వరకు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పరీక్షల సమన్వయ అధికారి విశ్వేశ్వరనాయుడు, యూపీఎస్సీ పరిశీలక అధికారి సౌరభ్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.

విశాఖలో యూపీఎస్సీ ప్రిలిమ్స్
ఈ నెల 24న నిర్వహించనున్న యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్ష-2026 కోసం విశాఖపట్నంలోని 17 కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా సంయుక్త కలెక్టర్ విద్యాధరి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. విశాఖ కేంద్రంగా మొత్తం 7,769 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు. పరీక్షలు ఉదయం 9.30 నుండి 11.30 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2.30 నుండి 4.30 గంటల వరకు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పరీక్షల సమన్వయ అధికారి విశ్వేశ్వరనాయుడు, యూపీఎస్సీ పరిశీలక అధికారి సౌరభ్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.

