Friday, 11 September 2026
  • Home  
  • వినాయక నిమజ్జన ప్రాంతాలను పరిశీలించిన రేణిగుంట డీఎస్పీ
- అన్నమయ్య

వినాయక నిమజ్జన ప్రాంతాలను పరిశీలించిన రేణిగుంట డీఎస్పీ

భక్తుల భద్రతకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచన నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు రేణిగుంట డీఎస్పీ శ్రీ వై. శ్రీనివాసరావు నిమజ్జన ప్రాంతాలను పరిశీలించారు.తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కోడూరు రూరల్ సీఐ శ్రీ డి. శ్రీనివాసులు గారితో కలిసి డీఎస్పీ శ్రీనివాసరావు గారు ఓబుళవారిపల్లి మండలంలోని మంగంపేట చెరువు, చిట్వేల్ మండలంలోని ఎల్లంరాజు చెరువు వద్ద ఏర్పాటు చేసిన వినాయక నిమజ్జన ప్రాంతాలను సందర్శించారు. అక్కడ చేపట్టిన భద్రతా ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.నిమజ్జనం రోజున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భక్తుల రాకపోకలు, ట్రాఫిక్ నియంత్రణ, పోలీసు బందోబస్తు, పార్కింగ్ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. భక్తులు పోలీసు శాఖ సూచనలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని, భద్రతా ఏర్పాట్లకు పోలీసులకు పూర్తి సహకారం అందించాలని డీఎస్పీ శ్రీ వై. శ్రీనివాసరావు గారు కోరారు.ఈ కార్యక్రమంలో ఓబుళవారిపల్లి ఎస్‌ఐ శ్రీ సుజన్ కుమార్, చిట్వేల్ ఎస్‌ఐ శ్రీ ఎస్. వినోద్ కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

భక్తుల భద్రతకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచన నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు రేణిగుంట డీఎస్పీ శ్రీ వై. శ్రీనివాసరావు నిమజ్జన ప్రాంతాలను పరిశీలించారు.తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కోడూరు రూరల్ సీఐ శ్రీ డి. శ్రీనివాసులు గారితో కలిసి డీఎస్పీ శ్రీనివాసరావు గారు ఓబుళవారిపల్లి మండలంలోని మంగంపేట చెరువు, చిట్వేల్ మండలంలోని ఎల్లంరాజు చెరువు వద్ద ఏర్పాటు చేసిన వినాయక నిమజ్జన ప్రాంతాలను సందర్శించారు. అక్కడ చేపట్టిన భద్రతా ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.నిమజ్జనం రోజున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భక్తుల రాకపోకలు, ట్రాఫిక్ నియంత్రణ, పోలీసు బందోబస్తు, పార్కింగ్ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
భక్తులు పోలీసు శాఖ సూచనలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని, భద్రతా ఏర్పాట్లకు పోలీసులకు పూర్తి సహకారం అందించాలని డీఎస్పీ శ్రీ వై. శ్రీనివాసరావు గారు కోరారు.ఈ కార్యక్రమంలో ఓబుళవారిపల్లి ఎస్‌ఐ శ్రీ సుజన్ కుమార్, చిట్వేల్ ఎస్‌ఐ శ్రీ ఎస్. వినోద్ కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.