Saturday, 16 May 2026
  • Home  
  • విద్యార్థులకు శక్తి టీం అవగాహన కార్యక్రమాలు
- అన్నమయ్య

విద్యార్థులకు శక్తి టీం అవగాహన కార్యక్రమాలు

రాయచోటి ఆగస్టు (పున్నమి ప్రతినిధి) అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా శక్తి టీమ్ బృందాలు విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాయి. ఈ సందర్భంగా విద్యార్థులకు గుడ్ టచ్ – బ్యాడ్ టచ్, పోక్సో చట్టాలు, ఈవ్ టీజింగ్, ప్రేమ పేరుతో మోసాలు, మహిళలపై నేరాలు వంటి అంశాలపై విస్తృత అవగాహన కల్పించారు. అలాగే డయల్ 112 అత్యవసర సేవలు, శక్తి యాప్ వినియోగం గురించి వివరించారు.ముఖ్యంగా విద్యార్థినులకు స్వీయ రక్షణ పద్ధతులు, సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లు, భవిష్యత్తు కోసం క్రమశిక్షణతో ప్రవర్తించే విధానాలు వంటి అంశాలపై చర్చ జరిగింది. ఎలాంటి సమస్య వచ్చినా 112 నెంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని విద్యార్థులకు సూచించారు. ఈ అవగాహన కార్యక్రమాలు పలు పోలీస్ స్టేషన్ పరిధిలోని పాఠశాలల్లో విజయవంతంగా నిర్వహించబడ్డాయి.

రాయచోటి ఆగస్టు (పున్నమి ప్రతినిధి)

అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా శక్తి టీమ్ బృందాలు విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాయి.

ఈ సందర్భంగా విద్యార్థులకు గుడ్ టచ్ – బ్యాడ్ టచ్, పోక్సో చట్టాలు, ఈవ్ టీజింగ్, ప్రేమ పేరుతో మోసాలు, మహిళలపై నేరాలు వంటి అంశాలపై విస్తృత అవగాహన కల్పించారు. అలాగే డయల్ 112 అత్యవసర సేవలు, శక్తి యాప్ వినియోగం గురించి వివరించారు.ముఖ్యంగా విద్యార్థినులకు స్వీయ రక్షణ పద్ధతులు, సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లు, భవిష్యత్తు కోసం క్రమశిక్షణతో ప్రవర్తించే విధానాలు వంటి అంశాలపై చర్చ జరిగింది. ఎలాంటి సమస్య వచ్చినా 112 నెంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని విద్యార్థులకు సూచించారు.

ఈ అవగాహన కార్యక్రమాలు పలు పోలీస్ స్టేషన్ పరిధిలోని పాఠశాలల్లో విజయవంతంగా నిర్వహించబడ్డాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.