ఎర్రగుంట నర్సింగ్ కళాశాల విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటనపై కసుమూరు వైద్యాధికారిణి ప్రవీణ స్పందించారు. శుక్రవారం సిబ్బందితో కలిసి కళాశాలను సందర్శించి, బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
అక్కడ ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించారు. వంటశాల, తాగునీటి ట్యాంకులను పరిశీలించి, క్లోరినేషన్ చేయించారు. విద్యార్థినులు గురువారం తిన్న ఆహార వివరాలు సేకరించారు. వారం రోజుల పాటు వారి ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించాలని సిబ్బందిని ఆదేశించారు.


