రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, యువ వికాసం పథకాలు, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రిక్ స్కూటీలపై బీఆర్‌ఎస్‌వీ ఆందోళన
నిర్మల్: విద్యార్థులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్, బీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో విద్యార్థులు, విద్యార్థినులు నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.
విద్యార్థులకు హామీ ఇచ్చిన రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, యువ వికాసం పథకం, విద్యార్థులకు నూతన ల్యాప్‌టాప్‌లు, అర్హులైన విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు అందించే హామీలను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.
విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆటలాడకుండా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారు కోరారు. విద్యా రంగానికి తగిన ప్రాధాన్యత కల్పించి విద్యార్థులకు అండగా నిలవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర యువజన నాయకులు గంధర్ రమేష్, రాష్ట్ర మాజీ మైనార్టీ సెక్రటరీ అక్రమాలి, బీఆర్‌ఎస్ మాజీ రాష్ట్ర యువజన సెక్రటరీ కే. సుశీల్ కుమార్ రావు, జిల్లా బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు ఎండీ మహబూబ్, బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర యువజన నాయకులు బి. సాయికుమార్, నిర్మల్ జిల్లా యువజన నాయకులు జుబేర్, మున్సిపల్ కౌన్సిలర్ శ్రీకాంత్ యాదవ్, నిర్మల్ టౌన్ సెక్రటరీ మసూద్, నయీమ్, బీఆర్‌ఎస్ టౌన్ మైనార్టీ సీనియర్ నాయకులు అయూబ్ ఖాన్, బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎండీ అజీజ్ తదితరులు పాల్గొన్నారు.



