అనపర్తి, సెప్టెంబరు 23 (పున్నమి ప్రతినిధి): భారతదేశం వాణిని విదేశాల్లో స్పష్టంగా వినిపించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిని ఎంపిక చేయడం జరుగుతోందని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తీకరించడంతో పాటు అనేక భాషలపై పట్టు, విషయ పరిజ్ఞానం పురందేశ్వరికి ఉన్నాయని పేర్కొన్నారు. ఇటీవల దక్షిణాఫ్రికాలో ఆమె పర్యటించిన సందర్భంగా కాశ్మీర్‌కు సంబంధించి ‘ఆక్రమిత కాశ్మీర్’ అనే పదాన్ని ఉపయోగించడంపై అభ్యంతరం వ్యక్తం చేసి, కాశ్మీర్‌పై భారతదేశ వైఖరిని విదేశాల్లో స్పష్టంగా వినిపించారని తెలిపారు. ఈ విషయంలో ఆమె ప్రత్యేకంగా నిలిచారని ఎమ్మెల్యే నల్లమిల్లి పేర్కొన్నారు.
Uploaded Video:


