వాడపల్లి,పున్నమి దినపత్రిక : కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని రాజమహేంద్రవరం ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి జునైద్ అహ్మద్ మౌలానా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు జడ్జి గారికి స్వామివారి చిత్రపటాన్ని అందజేసి, ప్రసాదాలను అందించారు. అంతకుముందు ఆలయ అధికారులు, సిబ్బంది ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
Uploaded Video:



