ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 18 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలం కాగితాలపూర్ క్రాస్ రోడ్డులో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో వాటర్ ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. మనుబోలుకు చెందిన నెల్లూరు జీవరత్నం వాటర్ ట్యాంకర్‌తో కూడిన ఆటోను రోడ్డు దాటుతుండగా, నెల్లూరు నుంచి గూడూరు వైపు వెళ్తున్న కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జీవరత్నం తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం కారణంగా కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించగా, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స అనంతరం బాధితుడిని మెరుగైన వైద్యం కోసం గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు.

వాటర్ ఆటోను ఢీకొన్న కారు.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 18 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం కాగితాలపూర్ క్రాస్ రోడ్డులో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో వాటర్ ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. మనుబోలుకు చెందిన నెల్లూరు జీవరత్నం వాటర్ ట్యాంకర్‌తో కూడిన ఆటోను రోడ్డు దాటుతుండగా, నెల్లూరు నుంచి గూడూరు వైపు వెళ్తున్న కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జీవరత్నం తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం కారణంగా కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించగా, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స అనంతరం బాధితుడిని మెరుగైన వైద్యం కోసం గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు.

