నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం నక్కలగండి రిజర్వాయర్‌లో మళ్లీ చేపల వేట మొదలైంది. ఎమ్మెల్యే కాకర్ల జోక్యంతో గతంలో నిలిచిన ఈ వేట, మూడు రోజులకే తిరిగి ప్రారంభం కావడం చర్చనీయాంశమైంది. ఎఫ్డీఓ మౌఖిక అనుమతులున్నాయని చెబుతున్నా, అధికారిక ఉత్తర్వులు లేకపోవడంపై సందిగ్ధత నెలకొంది. పోలీసుల పహారాలో టన్నుల కొద్దీ మత్స్య సంపద తరలిపోతుండగా, వేసవిలో నీటిని వృధా చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



