Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

మూసివేసిన బాణాసంచా కేంద్రాలు తెరవాలి : సిపిఎం డిమాండ్

Punnami Newsroom Published:
మూసివేసిన బాణాసంచా కేంద్రాలు తెరవాలి : సిపిఎం డిమాండ్

Story highlights

  • నిబంధనల పేరుతో నెల్లూరులో అధికారులు మూసివేయించిన బాణాసంచా తయారీ కేంద్రాలను తెరిపించి కార్మికులను వెంటనే ఆదుకోవాలని సిపిఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేశారు.
  • ఈ మేరకు బుధవారం కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్ సెల్ లో బాధితులతో కలిసి జాయింట్ కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు.
  • ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పదిమంది లైసెన్సుడు బాణసంచా తయారీ దారులు ఉన్నారని, వారి వద్ద వందమంది వరకు కార్మికులు పనిచేస్తున్నారని అన్నారు.

నిబంధనల పేరుతో నెల్లూరులో అధికారులు మూసివేయించిన బాణాసంచా తయారీ కేంద్రాలను తెరిపించి కార్మికులను వెంటనే ఆదుకోవాలని సిపిఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్ సెల్ లో బాధితులతో కలిసి జాయింట్ కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పదిమంది లైసెన్సుడు బాణసంచా తయారీ దారులు ఉన్నారని, వారి వద్ద వందమంది వరకు కార్మికులు పనిచేస్తున్నారని అన్నారు. గత నాలుగు నెలల నుండి వివిధ కారణాలు చెప్పి అధికారులు తయారీ కేంద్రాలను మూసి వేయించడంతో ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయని అన్నారు. ఇప్పటికన్నా జిల్లా అధికారులు నిబంధనలకు అనుగుణంగా ఉన్న షాపుల నిర్వహణకు వెంటనే అనుమతులు ఇచ్చి కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బాణాసంచా తయారీ కేంద్రాల యజమానులు శివ, అబ్బయ్య, సుబ్రహ్మణ్యం, రాజా మరియు కార్మికులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *