సింపోలో కంపెనీ పరిసరాల నుంచి మట్టి తరలింపు? — అధికారులు తక్షణమే పరిశీలించాలని స్థానికుల విజ్ఞప్తి…
దొరవారి సత్రం మండలం : రోశనూరు –రాజుపాలెం ప్రాంతంలో సింపోలో కంపెనీ పరిసరాల నుంచి మట్టిని తరలిస్తున్నారు అన్ని ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి. మట్టి తరలింపునకు సంబంధిత శాఖల నుంచి అనుమతులు ఉన్నాయా లేదా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉందని స్థానికులు పేర్కొంటున్నారు…
ఈ వ్యవహారంపై రెవెన్యూ, మైనింగ్ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి వాస్తవాలను నిర్ధారించాలని స్థానికులు కోరుతున్నారు. అనుమతులు లేకుండా మట్టి తరలింపు జరుగుతున్నట్లు విచారణలో తేలితే, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ప్రజలకు వాస్తవాలను తెలియజేయాలని కోరుతున్నారు…


