కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన వికసిత్ భారత్–గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) పథకం కింద గ్రామీణ కార్మికులకు రోజువారీ కనీస వేతనాన్ని ₹300గా నిర్ణయించింది. ఇప్పటివరకు ₹300 కంటే తక్కువ వేతనం చెల్లిస్తున్న రాష్ట్రాల్లో ఈ పెంపు అమలులోకి రాగా, ఇప్పటికే అంతకంటే ఎక్కువ చెల్లిస్తున్న రాష్ట్రాల్లో స్వల్ప పెంపు మాత్రమే చేశారు. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో గణనీయంగా వేతనాలు పెరిగాయి. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయాన్ని విమర్శిస్తూ ప్రస్తుత ధరల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కనీస వేతనం రోజుకు ₹400గా ఉండాలని డిమాండ్ చేసింది. కొత్త విధానంలో కేంద్ర–రాష్ట్రాల వ్యయ భాగస్వామ్యంపై కూడా పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

రోజుకు కనీస వేతనం ₹300గా నిర్ణయించిన కేంద్రం