ఖమ్మం: విజయవాడ నుంచి రామగుండం వెళ్తున్న కేరళ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న దేవ్వళ్ల ప్రశాంత్ (35) ప్రమాదానికి గురయ్యాడు. రైలు ఎగ్జిట్ వద్ద కూర్చొని కాలు బయట పెట్టడంతో ఖమ్మం జిల్లా చెరువు మాధారం సమీపంలో కాలు ప్లాట్‌ఫామ్‌కు తగిలి గాయమైంది. ఖమ్మం రైల్వే స్టేషన్‌కు సమీపంలో రక్తస్రావం అధికం కావడంతో తోటి ప్రయాణికులు రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో 108 సిబ్బంది కోట భాను సహన్, ఎం.ఎం. చక్రవర్తి ఖమ్మం రైల్వే స్టేషన్‌కు చేరుకుని ప్రశాంత్‌కు ప్రథమ చికిత్స అందించారు. .



