శ్రీకాళహస్తి, మే 12 (పున్నమి టెంపుల్ న్యూస్): కేంద్ర ప్రభుత్వ ‘సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్’ పథకం కింద రైతులకు రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాలు పంపిణీ చేయనున్నట్లు రమేష్ రెడ్డి తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యంత్ర పరికరాలు అవసరమైన రైతులు ఈ నెల 19వ తేదీలోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. రైతులు స్వయంగా లేదా సమీపంలోని రైతు సేవా కేంద్రాలు, మండల వ్యవసాయ అధికారుల సహాయంతో ఎటువంటి రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అందిన దరఖాస్తులను ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు జాయింట్ కలెక్టర్ సమక్షంలో లాటరీ విధానంలో పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు. ఎంపికైన రైతులు తమ వాటా మొత్తాన్ని సంబంధిత కంపెనీకి చెల్లించిన వెంటనే యంత్ర పరికరాలు అందజేయబడతాయని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, సన్నకారు, చిన్నకారు మహిళా రైతులకు 50 శాతం రాయితీ, ఇతర రైతులకు 40 శాతం రాయితీ వర్తిస్తుందని పేర్కొన్నారు. 40 హెచ్‌పీ లోపు ట్రాక్టర్లు, చిన్న ట్రాక్టర్లు, రొటావేటర్లు, నాగళ్ళు, మడకలు, లెవెలింగ్ బ్లేడ్స్, స్ప్రేయర్లు, పవర్ వీడర్లు, పవర్ టిల్లర్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తుకు ఆధార్ కార్డు, 1బి ఒరిజినల్, భూమి పాస్‌బుక్ జిరాక్స్, బ్యాంక్ ఖాతా వివరాలు, ట్రాక్టర్ ఇంజిన్ ఆర్‌సీ, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు సమర్పించాల్సి ఉంటుందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ రైతులు తప్పనిసరిగా కుల ధృవీకరణ పత్రం జత చేయాలని ఏడీఏ స్పష్టం చేశారు.

రైతులకు రాయితీపై వ్యవసాయ యంత్రాలు.. 19లోపు దరఖాస్తులకు అవకాశం