వెలుగోడు :పొలం పేరుతో పేద రైతును మోసగించిన వీఆర్వో అబ్దుల్లాపై కలెక్టర్ నేతృత్వంలో విచారణ కమిటీ వేసి కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం వెలుగోడు తహశీల్దార్ శ్రీనివాసులు గౌడ్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా పార్టీ జిల్లా నాయకుడు పి. లాజరస్, రైతు కూలీ సంఘం మండల అధ్యక్షుడు చాంద్ బాషా మాట్లాడుతూ.. బాధితుడు షేక్ హుస్సేన్ మియా దంపతుల వద్ద వీఆర్వో అబ్దుల్లా ఆయన సోదరులు పొలం అమ్మకం కోసం ₹7.30 లక్షలు తీసుకుని అగ్రిమెంట్ చేశారన్నారు. 2024 జూన్ 3న ఆన్లైన్లో ఎక్కించిన పేరును ఆ తర్వాత తొలగించి, వీఆర్వో తన బంధువుల పేర్లను చేర్చి రైతును మోసం చేశారని మండిపడ్డారు. బాధితుడికి న్యాయం జరిగే వరకు తమ పార్టీ అండగా ఉండి పోరాడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకుడు రవి, బాధితుడు హుస్సేన్ మియా దంపతులు పాల్గొన్నారు.

రైతును మోసగించిన వీఆర్వో అబ్దుల్లా పై కలెక్టర్‌తో విచారణ జరిపించాలి