మేడ్చల్: తెలంగాణ స్కూల్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి అండర్–12 క్రికెట్ టోర్నమెంట్లో ప్రగతి సెంట్రల్ స్కూల్ విజేతగా నిలిచింది. జూలై 28 నుంచి కొనసాగిన టోర్నమెంట్లో భాగంగా మేడ్చల్లోని యుక్త గ్రౌండ్లో జరిగిన ఫైనల్లో ఏఆర్ఎన్ జట్టుతో తలపడిన ప్రగతి సెంట్రల్ స్కూల్ విజయం సాధించింది. ఈ విషయాన్ని తెలంగాణ స్కూల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీరామ్, ఆంజనేయులు తెలిపారు. టోర్నమెంట్లో వన్ క్రికెట్ అకాడమీ, వేదిరి క్రికెట్ అకాడమీ జట్లు మూడో స్థానంలో నిలిచాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో కోచ్లు సన్నీ, అనుష్, గంగూలీ, ఆనంద్, దుర్యోధన్, నాగేష్, అంపైర్లు సతీష్, శ్యామ్, భారత్, సాయి తదితరులు పాల్గొన్నారు.



