రాయలసీమకు వెంటనే శ్రీశైలం నీరు విడుదల చేయాలి: రెడ్యమ్
ఖాజీపేట: శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా కేసీ కెనాల్, తెలుగు గంగతో పాటు రాయలసీమ ప్రాజెక్టులకు వెంటనే నీటిని విడుదల చేయాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణకు నీరు ఇస్తూ రాయలసీమను నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. రాజోలి జలాశయ నిర్మాణాన్ని ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలని, అలా చేస్తే కేసీ కెనాల్ పరిధిలోని 92 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు. రాయలసీమకు నీరు విడుదల చేయకపోతే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.



