అయోధ్య రామమందిరంలో భక్తులు సమర్పించిన విరాళాల దొంగతనంపై ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణలు చేశారు. కోట్ల రూపాయల విరాళాలు మాయమైనట్లు వార్తలు వస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ ఈ అంశంపై చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యకరమన్నారు. ఈ వ్యవహారంపై ప్రజలకు పూర్తి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం అయోధ్యకు వెళ్లి రామమందిరంలో ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు జరిపి నిజానిజాలు బయటపెట్టాలని ఆయన కోరారు.

రామమందిర విరాళాల దొంగతనంపై కేజ్రీవాల్ ఆరోపణలు