పువ్వాడ నాగేంద్ర కుమార్
(పున్నమి స్టాఫ రిపోర్టర్ ఖమ్మం జిల్లా)
తల్లాడ
యూరియా కొరత సృష్టిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.
నంబూరి రామలింగేశ్వరరావు
ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్
భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా పార్లమెంటరీ కన్వీనర్ శ్రీ నంబూరి రామలింగేశ్వరరావు సత్తుపల్లి నియోజకవర్గ పర్యటనలో భాగంగా తల్లాడ మండలంలోని అన్నారుగూడెం గ్రామంలో రైతులతో సమావేశమై, పొలాలను పరిశీలించారు. ఆయనతో పాటు తల్లాడ మండల మాజీ అధ్యక్షుడు ఆపతి వెంకట రామారావు మరియు పలువురు నాయకులు పాల్గొన్నారు.
ఈ ఖరీఫ్ సీజన్‌లో ఎకరానికి ఒక్క కట్ట యూరియా కూడా అందని దుస్థితి నెలకొంది. వరి పంటలు ఎదగక గిడసబారిపోతున్నాయి. ఇప్పటికైనా యూరియా ఇవ్వకపోతే మేము పెట్టిన పెట్టుబడే మాకు తిరిగి రాని పరిస్థితి వస్తుంది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మేమంతా నష్టపోతున్నాం” అని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సమస్యపై స్పందిస్తూ శ్రీ నంబూరి రామలింగేశ్వరరావు మాట్లాడుతూ
• కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు తగినంత యూరియా సరఫరా చేసినా, రాష్ట్ర ప్రభుత్వం దానిని రైతులకు అందించకుండా నల్లబజారుకు మళ్లించడం వల్లే ఈ రోజు రైతులు రోడ్లమీదకు రావాల్సిన పరిస్థితి వచ్చింది.
ఖమ్మం జిల్లాలో అత్యధిక వరి సాగు జరిగే సత్తుపల్లి నియోజకవర్గం, ముఖ్యంగా 20,000 ఎకరాలకు పైగా వరి పంటలు ఉన్న తల్లాడ మండలంలోనే ఈ విధంగా యూరియా కొరత రావడం, ప్రభుత్వ దుర్వ్యవస్థకు నిదర్శనం.
• రైతులను మోసం చేయడమే కాకుండా, తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు రాష్ట్ర వ్యవసాయ మంత్రి కేంద్రంపై ఆరోపణలు చేయడం అసభ్యకరమైన రాజకీయ నాటకం తప్ప మరొకటి కాదు.
• రైతులను వంచించే ఈ ప్రభుత్వాన్ని ప్రజలు క్షమించరని, ఇప్పటికైనా తక్షణమే యూరియా సరఫరా చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు.
తరువాత తల్లాడ వ్యవసాయ అధికారి కార్యాలయాన్ని సందర్శించి, అధికారులను కలసి రైతులకు పారదర్శకంగా యూరియా పంపిణీ చేయాలని కోరారు.“ఏ గ్రామానికి వచ్చిందో ఆ గ్రామంలో రైతులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
– “రైతుల ప్రయోజనాలను కాపాడడంలో ప్రభుత్వం విఫలమైతే, బీజేపీ రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు, ఆందోళనలు చేపడుతుంది. రైతు భవిష్యత్తు దెబ్బతినే పరిస్థితిని మేము ఎట్టి పరిస్థితుల్లోనూ సహించము” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో తల్లాడ మండల మాజీ అధ్యక్షుడు ఆపతి వెంకటరామారావు, జిల్లా కౌన్సిల్ సభ్యులు గాదె కృష్ణారావు, మండల ప్రధాన కార్యదర్శి పెరిక కిరణ్, ఓబీసీ మోర్చా మాజీ అధ్యక్షుడు వాడవల్లి నాగేశ్వరరావు, మండల కార్యదర్శి తమ్మిశెట్టి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


