పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో )
యలమంచిలి: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నికలు మంగళవారం ప్రశాంత వాతావరణంలో ఘనంగా జరిగాయి. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో నిర్వహించిన ఈ ఎన్నికల్లో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎస్ఎంసీ చైర్‌పర్సన్‌గా మల్ల లలిత, వైస్ చైర్మన్‌గా బండారు గ్రేస్ లలిత ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా పాఠశాలలో జరిగిన అభినందన సభలో కూటమి నాయకులు పాల్గొని నూతనంగా ఎన్నికైన చైర్పర్సన్, వైస్ చైర్మన్ సహా పాలకవర్గ సభ్యులను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. పాఠశాల సమగ్రాభివృద్ధికి, విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు కల్పించడంలో నూతన కమిటీ కీలక పాత్ర పోషించాలని నాయకులు సూచించారు. ఉపాధ్యాయులతో సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు మరింత పెరిగేలా కృషి చేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో యలమంచిలి కూటమి నాయకులు ఆడారి ఆదిమూర్తి, ఆడారి రమణబాబు, పిల్ల ఆదిబాబు, బీశెట్టి చెన్నారావు, ఆడారి నాయుడులతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు పాల్గొన్నారు..

యలమంచిలి జడ్పీ హైస్కూల్ ఎస్ఎంసీ చైర్‌పర్సన్‌గా మల్ల లలిత,
పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో ) యలమంచిలి: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నికలు మంగళవారం ప్రశాంత వాతావరణంలో ఘనంగా జరిగాయి. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో నిర్వహించిన ఈ ఎన్నికల్లో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎస్ఎంసీ చైర్‌పర్సన్‌గా మల్ల లలిత, వైస్ చైర్మన్‌గా బండారు గ్రేస్ లలిత ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పాఠశాలలో జరిగిన అభినందన సభలో కూటమి నాయకులు పాల్గొని నూతనంగా ఎన్నికైన చైర్పర్సన్, వైస్ చైర్మన్ సహా పాలకవర్గ సభ్యులను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. పాఠశాల సమగ్రాభివృద్ధికి, విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు కల్పించడంలో నూతన కమిటీ కీలక పాత్ర పోషించాలని నాయకులు సూచించారు. ఉపాధ్యాయులతో సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు మరింత పెరిగేలా కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యలమంచిలి కూటమి నాయకులు ఆడారి ఆదిమూర్తి, ఆడారి రమణబాబు, పిల్ల ఆదిబాబు, బీశెట్టి చెన్నారావు, ఆడారి నాయుడులతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు పాల్గొన్నారు..

