మొబైల్ ఫోన్లు, ట్యాబ్‌లను EMI ద్వారా కొనుగోలు చేసిన వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) భారీ ఊరటనిచ్చింది. రెండు నెలల పాటు లోన్ కట్టకపోయినా సదరు డివైజ్‌లను బ్లాక్ లేదా డీయాక్టివేట్ చేయకూడదని బ్యాంకర్లను ఆదేశించింది. అయితే, 90 రోజులు దాటినా స్పందించకపోతే(ఎమర్జెన్సీ సర్వీసులు మినహా) ఫోన్ ఫీచర్లను నిలిపివేయవచ్చని తెలిపింది. బకాయి చెల్లించిన గంటలోపు లాక్ తొలగించకపోతే, గంటకు రూ.250 చొప్పున కస్టమర్‌కు జరిమానా చెల్లించాలని RBI స్పష్టం చేసింది.



