మేడిపల్లి విద్యార్థులకు PRG ఫౌండేషన్ ప్రోత్సాహం
SSCలో మండల స్థాయిలో రెండో స్థానం సాధించిన గోదాసు సుష్మకు ఘన సన్మానం
యాచారం: మేడిపల్లి ZPHS ప్రభుత్వ పాఠశాలలో SSC పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను PRG ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. యాచారం మండలంలో SSC ఫలితాల్లో రెండో స్థానం సాధించిన గోదాసు సుష్మతో పాటు, మేడిపల్లి పాఠశాలలో 550కు పైగా మార్కులు సాధించిన ఎనిమిది మంది విద్యార్థులకు PRG ఫౌండేషన్ అధ్యక్షులు ప్రొద్దుటూరి రవీందర్ గుప్త నగదు బహుమతులు, మెమెంటోలు అందజేసి సత్కరించారు. విద్యార్థులను అభినందిస్తూ వారి ఉన్నత భవిష్యత్తుకు అవసరమైన ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉదయశ్రీ, సర్పంచ్ ముచ్చర్ల సుగుణ , ఉపసర్పంచ్ మధుకర్ రెడ్డి, PACS డైరెక్టర్ మక్కపల్లి స్వరూప, ఆలంపల్లి నరసింహ తదితరులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.





