Sunday, 26 July 2026
  • Home  
  • ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని పరామర్శించిన వైసీపీ జిల్లా యాక్టివిటీ సెక్రటరీ వంబోలు పోసిబాబు
- తూర్పు గోదావరి

ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని పరామర్శించిన వైసీపీ జిల్లా యాక్టివిటీ సెక్రటరీ వంబోలు పోసిబాబు

తాళ్లపూడి పున్నమి ప్రతినిధి: జులై 25: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ వైసీపీ జిల్లా యాక్టివిటీ సెక్రటరీ వంబోలు పోసిబాబు ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం పద్మనాభం తనయుడు, ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జ్ ముద్రగడ గిరిబాబుతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా పోసిబాబు మాట్లాడుతూ కాపుల రిజర్వేషన్ కోసం జీవితాంతం పోరాడిన మహోన్నత ఉద్యమ నాయకుడిని కోల్పోవడం బాధాకరమన్నారు. పద్మనాభం త్యాగాలు, సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తాయని, ఆయన ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాపు సంఘం అధ్యక్షుడు నామా ప్రకాశం, కరిబండి శ్రీనివాస్, దేవిశెట్టి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

తాళ్లపూడి పున్నమి ప్రతినిధి: జులై 25:
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ వైసీపీ జిల్లా యాక్టివిటీ సెక్రటరీ వంబోలు పోసిబాబు ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం పద్మనాభం తనయుడు, ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జ్ ముద్రగడ గిరిబాబుతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా పోసిబాబు మాట్లాడుతూ కాపుల రిజర్వేషన్ కోసం జీవితాంతం పోరాడిన మహోన్నత ఉద్యమ నాయకుడిని కోల్పోవడం బాధాకరమన్నారు. పద్మనాభం త్యాగాలు, సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తాయని, ఆయన ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాపు సంఘం అధ్యక్షుడు నామా ప్రకాశం, కరిబండి శ్రీనివాస్, దేవిశెట్టి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.