Thursday, 9 July 2026
  • Home  
  • మిట్టపల్లిలో సైబర్ భద్రత, మహిళల రక్షణపై పోలీసుల అవగాహన
- తిరుపతి

మిట్టపల్లిలో సైబర్ భద్రత, మహిళల రక్షణపై పోలీసుల అవగాహన

తిరుపతి జిల్లా, రైల్వేకోడూరు నియోజకవర్గం, చిట్వేల్ మండలం: చిట్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మిట్టపల్లి గ్రామంలో కోడూరు రూరల్ సీఐతో కలిసి పోలీసులు విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్తులకు సైబర్ నేరాలపై జాగ్రత్తలు, ఆన్‌లైన్ మోసాల నుంచి రక్షణ, ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు, వ్యక్తిగత సమాచారం ఎవరికీ ఇవ్వకూడదనే అంశాలపై వివరించారు. అనుమానాస్పద కాల్స్, లింకులు, సందేశాలను నమ్మకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని అవగాహన కల్పించారు. మహిళల భద్రతకు ప్రభుత్వం, పోలీసు శాఖ అందిస్తున్న సేవలు, అత్యవసర సహాయ నంబర్ల వినియోగంపై వివరించారు. గ్రామాల్లో మద్యం, జూదం, కోడిపందేలు, గంజాయి వంటి అక్రమ కార్యకలాపాలు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో ప్రజలు చట్టాలను గౌరవిస్తూ ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పేందుకు సహకరించాలని, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించాలని సూచించారు. పోలీసు–ప్రజల సమన్వయంతోనే నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ సాధ్యమవుతుందని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

తిరుపతి జిల్లా, రైల్వేకోడూరు నియోజకవర్గం, చిట్వేల్ మండలం: చిట్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మిట్టపల్లి గ్రామంలో కోడూరు రూరల్ సీఐతో కలిసి పోలీసులు విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్తులకు సైబర్ నేరాలపై జాగ్రత్తలు, ఆన్‌లైన్ మోసాల నుంచి రక్షణ, ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు, వ్యక్తిగత సమాచారం ఎవరికీ ఇవ్వకూడదనే అంశాలపై వివరించారు. అనుమానాస్పద కాల్స్, లింకులు, సందేశాలను నమ్మకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని అవగాహన కల్పించారు. మహిళల భద్రతకు ప్రభుత్వం, పోలీసు శాఖ అందిస్తున్న సేవలు, అత్యవసర సహాయ నంబర్ల వినియోగంపై వివరించారు. గ్రామాల్లో మద్యం, జూదం, కోడిపందేలు, గంజాయి వంటి అక్రమ కార్యకలాపాలు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

రానున్న ఎన్నికల నేపథ్యంలో ప్రజలు చట్టాలను గౌరవిస్తూ ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పేందుకు సహకరించాలని, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించాలని సూచించారు. పోలీసు–ప్రజల సమన్వయంతోనే నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ సాధ్యమవుతుందని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

1 Comment

  1. vinod kumar

    July 6, 2026

    ఈ నెల 1న పునపర్తిలో చంద్రబాబు సభకు రావాలని టీడీపీ నేతలు, ఫీల్డ్ అసిస్టెంట్.. ఉపాధి హామీ కూలీలకు ఆదేశాలు

    కానీ.. తాము రాలేమని ముందే చెప్పి సభకు దూరంగా ఉండిపోయిన కూలీలు. దాంతో ఇప్పుడు మీకు ఉపాధి హామీ పని కల్పించేది లేదని ఫీల్డ్ అసిస్టెంట్ బెదిరింపులు

    చిల్లకూరు గ్రామంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద మాజీ ఎంపీపీ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉడతావారి పాలెం గ్రామస్తులు నిరసన

    మీ సభకు రాకపోతే.. ఉపాధి హామీ కూలీల పొట్టగొడతారా

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.