*మార్కెట్లోకి కొత్తగా రూ.500 ప్లాస్టిక్ నోట్లు.. క్లారిటీ!*
మార్కెట్లోకి కొత్తగా రూ.500 ప్లాస్టిక్ నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిందని, ఈ నెల 30 నుంచి ఈ నోట్లు చలామణిలోకి వస్తాయని నెట్టింట ప్రచారం జరుగుతోంది. రూ.500 నోటుపై మహాత్మాగాంధీ చిహ్నాన్ని ముద్రించకపోవడం గమనించవచ్చు. అయితే ఈ నోటు ఏఐ ద్వారా రూపొందించబడిందని, ఒకవేళ కొత్త నోట్లు విడుదల చేస్తే RBI అధికారికంగా ప్రకటిస్తుందని అధికారులు చెబుతున్నారు.


