Friday, 28 August 2026
  • Home  
  • మారేళ్లపాడు ఎత్తిపోతల పథకం ప్రారంభానికి మంత్రి తుమ్మల
- BHADRADRI

మారేళ్లపాడు ఎత్తిపోతల పథకం ప్రారంభానికి మంత్రి తుమ్మల

అశ్వాపురం, ఆగస్టు 28: రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ నెల 29న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా అశ్వాపురం మండలంలోని మారేళ్లపాడు ఎత్తిపోతల పథకాన్ని మంత్రి ప్రారంభించనున్నారు. అధికారిక పర్యటన షెడ్యూల్ ప్రకారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్‌ బేగంపేట నుంచి బయలుదేరి, 10 గంటలకు అశ్వాపురం మండలం బీజీ కొత్తూరుకు చేరుకుంటారు. అక్కడి నుంచి 10.15 గంటలకు మారేళ్లపాడుకు చేరుకుని ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఉదయం 11 గంటలకు అశ్వాపురం మండలం గొండిగూడెం గ్రామానికి చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. మంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు అవసరమైన ఏర్పాట్లు, భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కాగా, మారేళ్లపాడు ఎత్తిపోతల పథకం ప్రారంభంతో ఈ ప్రాంత రైతులకు సాగునీటి సౌకర్యం మరింత మెరుగుపడే అవకాశం ఉందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.