వార్త ముఖ్యాంశాలు
- అశ్వాపురం/సూర్యాపేట, ఆగస్టు 28: రాష్ట్ర నీటిపారుదల, క్యాడ్, ఆహారం, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ నెల 29న భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాల్లో పర్యటించనున్నారు.
- పర్యటనలో భాగంగా అశ్వాపురం మండలంలోని మారేళ్లపాడు ఎత్తిపోతల పథకాన్ని సందర్శించి పంప్‌హౌస్‌ను ప్రారంభించనున్నారు.
- అధికారిక పర్యటన వివరాల ప్రకారం ఉదయం 10 గంటలకు బీజీ కొత్తూరు హెలిప్యాడ్‌కు చేరుకున్న అనంతరం మంత్రి రోడ్డు మార్గంలో మారేళ్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు వెళ్తారు.
అశ్వాపురం/సూర్యాపేట, ఆగస్టు 28: రాష్ట్ర నీటిపారుదల, క్యాడ్, ఆహారం, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ నెల 29న భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాల్లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా అశ్వాపురం మండలంలోని మారేళ్లపాడు ఎత్తిపోతల పథకాన్ని సందర్శించి పంప్‌హౌస్‌ను ప్రారంభించనున్నారు. అధికారిక పర్యటన వివరాల ప్రకారం ఉదయం 10 గంటలకు బీజీ కొత్తూరు హెలిప్యాడ్‌కు చేరుకున్న అనంతరం మంత్రి రోడ్డు మార్గంలో మారేళ్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు వెళ్తారు. ఉదయం 10.15 నుంచి 10.30 గంటల మధ్య మారేళ్లపాడు ఎత్తిపోతల పథకం పంప్‌హౌస్ స్విచ్ ఆన్ కార్యక్రమం నిర్వహించనున్నారు. అనంతరం అశ్వాపురం మండలం గొండిగూడెం గ్రామంలో పూజా కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారు. అనంతరం సూర్యాపేట జిల్లా నూతనకల్‌కు వెళ్లి నూతనకల్, మద్దిరాల మండలాల లబ్ధిదారులకు సీలింగ్ పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం సూర్యాపేట ఐడీఓసీలో రెవెన్యూ, రిజిస్ట్రేషన్, సర్వే, హౌసింగ్ శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. పర్యటనకు సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.