Tuesday, 4 August 2026
  • Home  
  • మారుతి హాల్ సమీపంలో అపరిశుభ్రత.. స్థానికుల ఆందోళన
- కడప

మారుతి హాల్ సమీపంలో అపరిశుభ్రత.. స్థానికుల ఆందోళన

🟥 కడప జిల్లా | పులివెందుల టౌన్ మారుతి హాల్ సమీపంలో అపరిశుభ్రత.. స్థానికుల ఆందోళన పులివెందుల పట్టణంలోని మారుతి హాల్ సమీపంలో ఉన్న స్వామి వివేకానంద బజార్ ప్రాంతంలో అపరిశుభ్రత తీవ్రంగా నెలకొంది. రోడ్డు పక్కనే చెత్తాచెదారం పేరుకుపోవడంతో పాటు పశువులు సంచరిస్తుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మార్గంలో ప్రతిరోజూ విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, వాహనదారులు రాకపోకలు సాగిస్తుండగా దుర్వాసన, అపరిశుభ్ర వాతావరణం ప్రజలకు ఇబ్బందిగా మారిందని, ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించలేదని వారు పేర్కొన్నారు. వెంటనే స్పందించి పేరుకుపోయిన చెత్తను తొలగించి, ఆ ప్రాంతాన్ని పూర్తిగా శుభ్రపరచడంతో పాటు భవిష్యత్తులో చెత్త పేరుకుపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను స్థానికులు కోరుతున్నారు.

🟥 కడప జిల్లా | పులివెందుల టౌన్

మారుతి హాల్ సమీపంలో అపరిశుభ్రత.. స్థానికుల ఆందోళన

పులివెందుల పట్టణంలోని మారుతి హాల్ సమీపంలో ఉన్న స్వామి వివేకానంద బజార్ ప్రాంతంలో అపరిశుభ్రత తీవ్రంగా నెలకొంది. రోడ్డు పక్కనే చెత్తాచెదారం పేరుకుపోవడంతో పాటు పశువులు సంచరిస్తుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ మార్గంలో ప్రతిరోజూ విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, వాహనదారులు రాకపోకలు సాగిస్తుండగా దుర్వాసన, అపరిశుభ్ర వాతావరణం ప్రజలకు ఇబ్బందిగా మారిందని, ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించలేదని వారు పేర్కొన్నారు. వెంటనే స్పందించి పేరుకుపోయిన చెత్తను తొలగించి, ఆ ప్రాంతాన్ని పూర్తిగా శుభ్రపరచడంతో పాటు భవిష్యత్తులో చెత్త పేరుకుపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను స్థానికులు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.