డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం పరిధిలోని కే గంగవరం మండలం శెరులంక గ్రామంలో బీమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో మహిళా హక్కులు మరియు గృహహింసను గూర్చి అర్ధ సంవత్సర సామూహిక ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీమాబాయి మహిళా మండలి చీఫ్ ఫంక్షనరీ వాసంశెట్టి నందివర్ధన మాట్లాడుతూ మహిళలు తమకు గల హక్కుల పట్ల అవగాహన పెంచుకొని హక్కుల సాధనకు న్యాయపరంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యానిమేటర్ రత్నకుమారి మాట్లాడుతూ గృహ హింసను గూర్చి వివరించారు. ఈ సందర్భంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించి మహిళల హక్కులకు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు పరిధిలోని మహిళలతో పాటు బీమాబాయి మహిళా మండల సిబ్బంది పాల్గొన్నారు.

మహిళా హక్కులు మరియు గృహహింసను గూర్చి అర్థ సంవత్సర సామూహిక ప్రచార కార్యక్రమం