నెల్లూరులో నిర్వహించనున్న తెలుగుదేశం పార్టీ మహానాడు విజయవంతానికి చేపడుతున్న ఏర్పాట్లపై సీఎం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మంతెన సత్యనారాయణ రాజు, ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. మహానాడు సందర్భంగా భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ సదుపాయాలు, ప్రజల రాకపోకలు, వేదిక వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృతంగా చర్చించారు. భారీగా కార్యకర్తలు, ప్రజలు హాజరుకానున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయంతో పనిచేయాలని అధికారులు నిర్ణయించారు.



