*మహనీయుల త్యాగఫలం మన స్వాతంత్రం…*
*నాటి స్వాతంత్రోద్యమ స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శం కావాలి…*
*ఇర్రిపాక పంచాయతీ మరియు హై స్కూల్ వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సతీమణి జ్యోతుల మణిమ్మ..*
కాకినాడ, జగ్గంపేట, ఇరిపాక, పున్నమి ప్రతినిధి,ఆగస్టు 15:రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించి నిలిచిన ఎందరో త్యాగధనుల, మహనీయుల పోరాటంతో మన దేశం స్వాతంత్రాన్ని సాధించిందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సతీమణి జగ్గంపేట కో-ఆపరేటివ్ సొసైటీ మాజీ చైర్మన్ జ్యోతుల మణిమ్మ వ్యాఖ్యానించారు. 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఇర్రిపాక పంచాయతీ కార్యాలయం, హై స్కూల్ వద్ద ఆమె త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవ వందనం సమర్పించారు. ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మనం పీలుస్తున్న స్వేచ్ఛా వాయువులు లక్షలాదిమంది దేశభక్తుల ప్రాణత్యాగానికి ప్రతీకని అనునిత్యం గుర్తు చేసుకోవాలన్నారు.నాటి స్వాతంత్ర స్ఫూర్తి నేటి యువతలో ప్రతిబింబించినప్పుడే దేశం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తుందన్నారు.
స్వతంత్ర దినోత్సవ సందర్భంగా వివిధ క్రీడల్లో విజేతలైన వారిని అభినందించి బహుమతి ప్రధానం చేశారు.ఈ కార్యక్రమంలో బస్వా చినబాబు, పంతం సత్యనారాయణ, జ్యోతుల ఈశ్వరరావు, జ్యోతుల సత్యమూర్తి, కే సినీడి అప్పారావు, కోనేటి వెంకటేశ్వరరావు, కొండ్రపు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.




