Sunday, 16 August 2026

Tag: జగ్గంపేట మండలం

తూర్పు గోదావరి

తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా సైనికులు అప్పన్న దొర కి

జగ్గంపేట మండలం, ఇదిపాక, పున్నమి ప్రతినిధి, ఆగస్టు 16 ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న జగ్గంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే , టీటీడీ పాలకవర్గ సభ్యులు *జ్యోతుల నెహ్రు గార్కి* , కాకినాడ జిల్లా.అధ్యక్షులు *జ్యోతుల నవీన్ గార్కి* వీరాభిమాని కాకినాడ జిల్లా విభిన్న ప్రతిభావంతుల అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా సైనికులు , *జ్యోతుల నెహ్రు గారు, జ్యోతుల నవీన్ గారు* నిర్వహించే *అభివృద్ధి* కార్యక్రమాలు మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు తెలిసేలా అహర్నిశలు కష్టపడుతున్న మా మిత్రుడు *శ్రీ మండపాక అప్పన్న దొర గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు* నిండునూరేళ్లు అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో, సిరిసంపదలతో మరెన్నో ఉన్నత పదవులతో ఆ భగవంతుని ఆశీస్సులతో మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనసారా కకోరుకుంటూ…. మీ………..మిత్రుడు పున్నమి రిపోర్టర్ ఎం శ్రీను

తూర్పు గోదావరి

మహనీయుల త్యాగఫలం మన స్వాతంత్రం

*మహనీయుల త్యాగఫలం మన స్వాతంత్రం…* *నాటి స్వాతంత్రోద్యమ స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శం కావాలి…* *ఇర్రిపాక పంచాయతీ మరియు హై స్కూల్ వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సతీమణి జ్యోతుల మణిమ్మ..* కాకినాడ, జగ్గంపేట, ఇరిపాక, పున్నమి ప్రతినిధి,ఆగస్టు 15:రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించి నిలిచిన ఎందరో త్యాగధనుల, మహనీయుల పోరాటంతో మన దేశం స్వాతంత్రాన్ని సాధించిందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సతీమణి జగ్గంపేట కో-ఆపరేటివ్ సొసైటీ మాజీ చైర్మన్ జ్యోతుల మణిమ్మ వ్యాఖ్యానించారు. 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఇర్రిపాక పంచాయతీ కార్యాలయం, హై స్కూల్ వద్ద ఆమె త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవ వందనం సమర్పించారు. ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మనం పీలుస్తున్న స్వేచ్ఛా వాయువులు లక్షలాదిమంది దేశభక్తుల ప్రాణత్యాగానికి ప్రతీకని అనునిత్యం గుర్తు చేసుకోవాలన్నారు.నాటి స్వాతంత్ర స్ఫూర్తి నేటి యువతలో ప్రతిబింబించినప్పుడే దేశం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తుందన్నారు. స్వతంత్ర దినోత్సవ సందర్భంగా వివిధ క్రీడల్లో విజేతలైన వారిని అభినందించి బహుమతి ప్రధానం చేశారు.ఈ కార్యక్రమంలో బస్వా చినబాబు, పంతం సత్యనారాయణ, జ్యోతుల ఈశ్వరరావు, జ్యోతుల సత్యమూర్తి, కే సినీడి అప్పారావు, కోనేటి వెంకటేశ్వరరావు, కొండ్రపు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.