పున్నమి ప్రతినిధి : తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు మరవలేని మహానేతగా చరిత్రలో నిలిచిపోయారని జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ ప్రెసిడెంట్ షేక్ నాయకుల ఫయాజ్ పేర్కొన్నారు . వైయస్సార్ జయంతి సందర్బంగా గూడూరు హాస్పిటల్ రోడ్డులోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు . ఏ నాయకుడు చేయని విధంగా అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లో తనదైన ముద్ర వేసిన మహా నాయకుడుగా రాజశేఖర్ రెడ్డి చరిత్రలో నిలిచిపోయారని, అలాగే ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, 108 అంబులెన్స్ సేవలు లాంటి అనేక ప్రజా సంక్షేమ పథకాలతో రాష్ట్రంలోనే కాక భారత దేశంలోనే అనేక మంది నాయకులకు మార్గదర్శకులుగా నిలిచారని ఫయాజ్ పేర్కొన్నారు .


