మత్స్యకార మహిళల నిర్బంధం అన్యాయం : కాకాణి
SPSR నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి వెంకటాచలం మండలంలోని కాకుటూరు, కాకర్లవారి పాలెం గ్రామాల్లో పర్యటించారు. సీఎం పర్యటన సందర్భంగా చెన్నాయపాలెం మత్స్యకార మహిళలను పోలీసులు అడ్డుకోవడం అన్యాయమని ఆయన విమర్శించారు. ప్రజల సమస్యలు చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పర్యటనను ప్రభుత్వ కార్యక్రమంలా కాకుండా ప్రైవేట్ ఈవెంట్లా నిర్వహించారని అన్నారు. మత్స్యకారుల ఇంట భోజనం, చేపల కూర, తాటి ముంజల కార్యక్రమాలు ప్రజల్లో నవ్వుల పాలయ్యాయని ఎద్దేవా చేశారు. జగన్ హయాంలో జరిగిన అభివృద్ధినే గ్రామాల్లో ప్రజలు గుర్తుచేసుకుంటున్నారని కాకాణి పేర్కొన్నారు. అనంతరం కాకుటూరులో జరిగిన ముందస్తు వేడుకలో పాల్గొని, కాకర్లవారి పాలెంలో గుమ్మా రామచంద్రయ్య కుటుంబాన్ని పరామర్శించారు.

మత్స్యకార మహిళల నిర్బంధం అన్యాయం : కాకాణి
మత్స్యకార మహిళల నిర్బంధం అన్యాయం : కాకాణి SPSR నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి వెంకటాచలం మండలంలోని కాకుటూరు, కాకర్లవారి పాలెం గ్రామాల్లో పర్యటించారు. సీఎం పర్యటన సందర్భంగా చెన్నాయపాలెం మత్స్యకార మహిళలను పోలీసులు అడ్డుకోవడం అన్యాయమని ఆయన విమర్శించారు. ప్రజల సమస్యలు చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పర్యటనను ప్రభుత్వ కార్యక్రమంలా కాకుండా ప్రైవేట్ ఈవెంట్లా నిర్వహించారని అన్నారు. మత్స్యకారుల ఇంట భోజనం, చేపల కూర, తాటి ముంజల కార్యక్రమాలు ప్రజల్లో నవ్వుల పాలయ్యాయని ఎద్దేవా చేశారు. జగన్ హయాంలో జరిగిన అభివృద్ధినే గ్రామాల్లో ప్రజలు గుర్తుచేసుకుంటున్నారని కాకాణి పేర్కొన్నారు. అనంతరం కాకుటూరులో జరిగిన ముందస్తు వేడుకలో పాల్గొని, కాకర్లవారి పాలెంలో గుమ్మా రామచంద్రయ్య కుటుంబాన్ని పరామర్శించారు.

