Tuesday, 30 June 2026
  • Home  
  • మంత్రి లోకేష్ చేతుల మీదుగా షైనింగ్ స్టార్ అవార్డు అందుకున్న నందవరం మోడల్ స్కూల్ విద్యార్థి
- ఆంధ్రప్రదేశ్

మంత్రి లోకేష్ చేతుల మీదుగా షైనింగ్ స్టార్ అవార్డు అందుకున్న నందవరం మోడల్ స్కూల్ విద్యార్థి

మర్రిపాడు మండలం నందవరం మోడల్ స్కూల్‌కు చెందిన విద్యార్థి పెసల గోవర్ధన్ పదవ తరగతి పరీక్షా ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి షైనింగ్ స్టార్ అవార్డుకి ఎంపికై,మంగళగిరిలో నిర్వహించిన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా తన తల్లితో కలిసి ఈ అవార్డును అందుకున్నాడని ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ తెలియజేశారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ,రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేందుకు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన షైనింగ్ స్టార్ అవార్డుకు తమ పాఠశాల విద్యార్థి ఎంపికై అవార్డు అందుకోవడం తమకు ఎంతో గర్వకారణమని అన్నారు.ఈ అవార్డు ఇతర విద్యార్థులకు సైతం స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని పేర్కొన్నారు.పెసల గోవర్ధన్ సాధించిన ఈ విజయంపై ఉపాధ్యాయులు,తల్లిదండ్రులు,విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియచేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.