Sunday, 26 July 2026
  • Home  
  • మండల విద్యాభివృద్ధికి కృషి చేస్తా: ఎంఈఓ హజరత్తయ్య
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మండల విద్యాభివృద్ధికి కృషి చేస్తా: ఎంఈఓ హజరత్తయ్య

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 25 (పున్నమి ప్రతినిధి) మనుబోలు, జూలై 25: మనుబోలు మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ)గా బాధ్యతలు స్వీకరించిన జి. హజరత్తయ్య మండలంలో విద్యాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. నెల్లూరు రూరల్ మండలం బుజ్జబుజ్జ నెల్లూరులోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఆయన పదోన్నతిపై ఇన్‌చార్జి ఎంఈఓగా నియమితులయ్యారు. ప్రభుత్వం చేపడుతున్న విద్యా కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తామని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన ఉచిత విద్య అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు ఆయనకు ఘన స్వాగతం పలికి సన్మానించారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 25 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు, జూలై 25: మనుబోలు మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ)గా బాధ్యతలు స్వీకరించిన జి. హజరత్తయ్య మండలంలో విద్యాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. నెల్లూరు రూరల్ మండలం బుజ్జబుజ్జ నెల్లూరులోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఆయన పదోన్నతిపై ఇన్‌చార్జి ఎంఈఓగా నియమితులయ్యారు. ప్రభుత్వం చేపడుతున్న విద్యా కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తామని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన ఉచిత విద్య అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు ఆయనకు ఘన స్వాగతం పలికి సన్మానించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.