ప్రొద్దుటూరు సెప్టెంబర్ 10.
ఎన్టీఆర్ భరోసా పింఛన్‌కు సంబంధించిన వివరాల నమోదుకు డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదుపై ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ స్పందించారు. వాట్సాప్ ద్వారా వచ్చిన సమాచారంతో 7వ వార్డులో ఆకస్మికంగా విచారణ చేపట్టారు.
విచారణలో వెల్ఫేర్ అసిస్టెంట్ చెన్న సుదర్శన్ 10 మంది లబ్ధిదారుల నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.200 చొప్పున వసూలు చేసినట్లు తేలింది. దీంతో కమిషనర్ స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వసూలు చేసిన నగదును తిరిగి ఇప్పించారు. సిబ్బంది చేసిన తప్పిదానికి లబ్ధిదారులకు క్షమాపణలు చెప్పిన ఆయన, వెల్ఫేర్ అసిస్టెంట్‌కు వివరణ కోరుతూ తాఖీదు జారీ చేశారు. ప్రభుత్వ పథకాల అమలులో పేదల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు కఠిన చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు

