బిజినేపల్లి ( తిమ్మగళ్ల మల్లికార్జున్ పున్నమి ప్రతినిధి ఆగస్టు 7 ): పూత దశ నుంచి కోత వరకు పంట పొలాల్లో జిగురు అట్టలు ఏర్పాటు చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రాష్ట్రీయ సేవా పథకం (NSS) విద్యార్థులు సూచించారు. సోమవారం మండలంలోని మంగనూరులో రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎకరం పొలంలో 15 జిగురు అట్టలు అమర్చుకోవాలని, ఒక్కో అట్టకు కేవలం రూ.20 ఖర్చవుతుందన్నారు. వీటి ద్వారా తామర పురుగు, తెల్ల దోమలు, ఈగల బెడద తగ్గుతుందన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు సి. అనిత, కె. నందిని, కె. సింధు, ఎం.డి. మహరాజ్ సుల్తానా, ఎం. మహేశ్వరి పాల్గొన్నారు.

మంగనూరు గ్రామంలో జిగురు అట్టలతో పంటలకు రక్షణ: వ్యవసాయ విద్యార్థులు