Saturday, 20 June 2026
  • Home  
  • భీమవరం: కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయోత్సవం నిర్వహణ
- పశ్చిమ గోదావరి

భీమవరం: కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయోత్సవం నిర్వహణ

భీమవరం: పశ్చిమ గోదావరి జిల్లా పెద అమిరంలోని రాధాకృష్ణ కన్వెన్షన్ హాల్‌లో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు), కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా నిమ్మల రామానాయుడు, డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు, రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ, బిజేపి పవనకుమార్ బి, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, మరియు ఇతర ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎమెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) ప్రజల అవసరాలకు అనుగుణంగా సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తోందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ఆక్వా రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ఆక్వా రైతులకు అన్ని విధాలా ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. Video Link: https://bpknewsofficial.blogspot.com/2026/06/sundar-pichai-message-to-students-stanford-speech.html

భీమవరం: పశ్చిమ గోదావరి జిల్లా పెద అమిరంలోని రాధాకృష్ణ కన్వెన్షన్ హాల్‌లో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు), కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా నిమ్మల రామానాయుడు, డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు, రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ, బిజేపి పవనకుమార్ బి, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, మరియు ఇతర ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ఎమెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) ప్రజల అవసరాలకు అనుగుణంగా సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తోందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ఆక్వా రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ఆక్వా రైతులకు అన్ని విధాలా ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.

Video Link: https://bpknewsofficial.blogspot.com/2026/06/sundar-pichai-message-to-students-stanford-speech.html

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.