Monday, 14 September 2026
  • Home  
  • భరత్‌నగర్‌లో పోచమ్మ దేవాలయం వద్ద అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
- రంగారెడ్డి

భరత్‌నగర్‌లో పోచమ్మ దేవాలయం వద్ద అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

పున్నమి: ఎల్బీనగర్, తెలంగాణ గిరిజన బహుజన సేవాసమితి రాష్ట్ర అధ్యక్షులు రాయపురం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎల్బీనగర్‌ భరత్‌నగర్‌ కాలనీలోని పోచమ్మ దేవాలయం వద్ద ఆదివారం రోజున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తెలంగాణ బహుజనులు, గిరిజనులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. తెలంగాణ బహుజనులు, గిరిజనులపై పోచమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తూ భక్తులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు, స్థానికులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కోనేటి నరసింహ, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు చిప్పలపల్లి యాదగిరి, బహుజన నాయకులు సంతోష్‌, రాజేష్‌, యాదగిరి, నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

పున్నమి: ఎల్బీనగర్, తెలంగాణ గిరిజన బహుజన సేవాసమితి రాష్ట్ర అధ్యక్షులు రాయపురం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎల్బీనగర్‌ భరత్‌నగర్‌ కాలనీలోని పోచమ్మ దేవాలయం వద్ద ఆదివారం రోజున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తెలంగాణ బహుజనులు, గిరిజనులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. తెలంగాణ బహుజనులు, గిరిజనులపై పోచమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తూ భక్తులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు, స్థానికులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కోనేటి నరసింహ, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు చిప్పలపల్లి యాదగిరి, బహుజన నాయకులు సంతోష్‌, రాజేష్‌, యాదగిరి, నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.