Friday, 26 June 2026
  • Home  
  • భద్రాచలం ఆలయ అభివృద్ధి పనులకు ఈ నెల 27న శ్రీకారం.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
- ఖమ్మం

భద్రాచలం ఆలయ అభివృద్ధి పనులకు ఈ నెల 27న శ్రీకారం.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ఖమ్మం జూన్ (పున్నమి జిల్లా రిపోర్టర్ ) దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి చెందిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం అభివృద్ధి పనులకు ఈ నెల 27న శ్రీకారం చుడనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార & పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆగమశాస్త్ర నియమాలను కచ్చితంగా పాటిస్తూ, సంప్రదాయ శిల్పకళను ప్రతిబింబించే రాతి నిర్మాణాలతో పనులు చేపట్టాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి మంజూరు చేసిన రూ.351 కోట్లతో చేపట్టనున్న ఈ పనులను వచ్చే శ్రీరామ నవమి నాటికి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఖమ్మం జూన్
(పున్నమి జిల్లా రిపోర్టర్ )

దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి చెందిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం అభివృద్ధి పనులకు ఈ నెల 27న శ్రీకారం చుడనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార & పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆగమశాస్త్ర నియమాలను కచ్చితంగా పాటిస్తూ, సంప్రదాయ శిల్పకళను ప్రతిబింబించే రాతి నిర్మాణాలతో పనులు చేపట్టాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి మంజూరు చేసిన రూ.351 కోట్లతో చేపట్టనున్న ఈ పనులను వచ్చే శ్రీరామ నవమి నాటికి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.