Tuesday, 15 September 2026
  • Home  
  • భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు… సిరి మహాలక్ష్మి ఇన్‌ఫ్రా డెవలపర్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు
- రంగారెడ్డి

భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు… సిరి మహాలక్ష్మి ఇన్‌ఫ్రా డెవలపర్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు

పున్నమి: సెప్టెంబర్ 14, రంగారెడ్డి జిల్లా: ఎల్బీనగర్, వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని సిరి మహాలక్ష్మి ఇన్‌ఫ్రా డెవలపర్స్ ఆధ్వర్యంలో సోమవారం సంస్థ కార్యాలయంలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంస్థ చైర్మన్ కళ్లెం వెంకటేశ్వర్ రెడ్డి, రాజేశ్వరి దంపతులు విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా సంస్థ అభివృద్ధికి సహకరిస్తున్న ఉద్యోగులు, సిబ్బంది, కస్టమర్లు, వారి కుటుంబ సభ్యులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని స్వామివారిని ప్రార్థించారు. వినాయకుని ఆశీస్సులతో సంస్థ మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో హనీమీ రెడ్డి, సంస్థ ప్రతినిధులు, ఉద్యోగులు, సిబ్బంది, శ్రేయోభిలాషులు ఉత్సాహంగా పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. వినాయక నామస్మరణతో సంస్థ కార్యాలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

పున్నమి: సెప్టెంబర్ 14, రంగారెడ్డి జిల్లా: ఎల్బీనగర్, వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని సిరి మహాలక్ష్మి ఇన్‌ఫ్రా డెవలపర్స్ ఆధ్వర్యంలో సోమవారం సంస్థ కార్యాలయంలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంస్థ చైర్మన్ కళ్లెం వెంకటేశ్వర్ రెడ్డి, రాజేశ్వరి దంపతులు విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, నైవేద్యాలు సమర్పించారు.

ఈ సందర్భంగా సంస్థ అభివృద్ధికి సహకరిస్తున్న ఉద్యోగులు, సిబ్బంది, కస్టమర్లు, వారి కుటుంబ సభ్యులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని స్వామివారిని ప్రార్థించారు. వినాయకుని ఆశీస్సులతో సంస్థ మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో హనీమీ రెడ్డి, సంస్థ ప్రతినిధులు, ఉద్యోగులు, సిబ్బంది, శ్రేయోభిలాషులు ఉత్సాహంగా పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. వినాయక నామస్మరణతో సంస్థ కార్యాలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.