Monday, 21 September 2026
  • Home  
  • భక్తిశ్రద్ధలతో మంగళగౌరీ వ్రతం
- కడప

భక్తిశ్రద్ధలతో మంగళగౌరీ వ్రతం

సిద్ధవటం మండలం మాధవరం-1 గ్రామంలోని శ్రీ మంగళగౌరీ సమేత అమరలింగేశ్వర ఆలయంలో శ్రావణ మంగళవారాన్ని పురస్కరించుకుని మంగళగౌరీ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను చేపట్టి అమ్మవారిని విశేషంగా అలంకరించారు. ఉదయం ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యంగిరి హోమం, పంచామృత అభిషేకం, ప్రత్యేక అర్చనలు, పూజలు నిర్వహించారు. శ్రావణ మాసం సందర్భంగా మంగళగౌరీ వ్రతానికి ఉన్న విశిష్టతను దృష్టిలో ఉంచుకుని మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. సంప్రదాయబద్ధంగా వ్రతాన్ని ఆచరించి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.ఆలయ ప్రాంగణంలో భక్తులతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. వ్రతంలో పాల్గొన్న మహిళలు కుటుంబ సభ్యుల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శ్రేయస్సు కోసం అమ్మవారిని ప్రార్థించారు. పూజా కార్యక్రమాలు పూర్తయిన అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

సిద్ధవటం మండలం మాధవరం-1 గ్రామంలోని శ్రీ మంగళగౌరీ సమేత అమరలింగేశ్వర ఆలయంలో శ్రావణ మంగళవారాన్ని పురస్కరించుకుని మంగళగౌరీ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను చేపట్టి అమ్మవారిని విశేషంగా అలంకరించారు.
ఉదయం ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యంగిరి హోమం, పంచామృత అభిషేకం, ప్రత్యేక అర్చనలు, పూజలు నిర్వహించారు. శ్రావణ మాసం సందర్భంగా మంగళగౌరీ వ్రతానికి ఉన్న విశిష్టతను దృష్టిలో ఉంచుకుని మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. సంప్రదాయబద్ధంగా వ్రతాన్ని ఆచరించి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.ఆలయ ప్రాంగణంలో భక్తులతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. వ్రతంలో పాల్గొన్న మహిళలు కుటుంబ సభ్యుల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శ్రేయస్సు కోసం అమ్మవారిని ప్రార్థించారు. పూజా కార్యక్రమాలు పూర్తయిన అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.