పాలెంలోని శ్రీ అలర్మేల్ మంగ సమేత వేంకటేశ్వర స్వామి ఆలయంలో వరలక్ష్మీ వ్రత మహోత్సవం కంటికింపుగా సాగింది. శ్రావణ శుభఘడియల్లో అర్చకులు వేదమంత్రాల నడుమ వరలక్ష్మీ వ్రతాన్ని అత్యంత వైభవంగా జరిపారు. స్వామి, అమ్మవార్లను సువాసనాభరిత పుష్పాలతో అలంకరించి, ప్రత్యేక నైవేద్యాలు నివేదించారు. భక్తులకు అర్చకస్వాములు వేదాశీస్సులు అందజేశారు. సకల శుభాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించే లక్ష్మీదేవి కృప అందరిపై ఉండాలని ఆలయ ఈవో పేరొన్నారు.

భక్తిపారవశ్యం.. పాలెంలో శ్రీ వరలక్ష్మీ వ్రత పూజలు